డ్రమ్స్ వాయించడంలో ఆయనకి ఆయనే సాటి..అందరికీ సుపరిచితుడు డ్రమ్మర్ శివమణి.ఆయన గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రపంచ వ్యాప్తంగా ఆయనకి అభిమానులు ఉన్నారు. అందుబాటులో ఉన్న దేని సాయంతో అయినా ఆయన అలవోకగా మ్యూజిక్‌ను వాయించగలరు. తాజాగా ఆయన దోశ తవాను డ్రమ్స్‌లా మార్చుకుని అందరినీ ఆకట్టుకున్నారు. బెంగళూరు లోని ఐకానిక్ సౌత్ ఇండియన్ రెస్టారెంట్ విద్యార్థి భవన్ ను శివమణి సందర్శించారు. అక్కడ అల్పాహారం ఆస్వాదించారు. ఈ సందర్భంగా రెస్టారెంట్ కిచెన్‌లోకి వెళ్లిన శివమణి.. అద్భుతమైన ప్రదర్శన ఇచ్చారు. దోశలు వేసే పెనంపై చిన్న కప్స్ సాయంతో సంగీతం వాయించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ‘శివమణి మ్యూజికల్ దోశ..’, ‘కాదేదీ సంగీతానికి అనర్హం’ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.ఇప్పుడీ వీడియో వైరల్ గా మారింది.