టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు అరుదైన గౌరవం లభించింది. ప్రఖ్యాత హాలీవుడ్ సినిమా వార్తల మ్యాగజైన్ ‘ది హాలీవుడ్ రిపోర్టర్’ ఇప్పుడు ది ‘హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా’ పేరిట భారత్ లోనూ అలరించనుంది. భారత్ లో ఈ మ్యాగజైన్ తొలి సంచికను అల్లు అర్జున్ ముఖచిత్రంతో తీసుకువస్తుండడం విశేషం. అల్లు అర్జున్: ది రూల్ పేరిట కవర్ పేజీ కథనం కూడా రూపొందించారు. అల్లు అర్జున్ హీరోగా తెలుగులో తీసిన పుష్ప-2 చిత్రం హిందీ సినిమా చరిత్రను తిరగరాసిందని ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా పేర్కొంది. అల్లు అర్జున్ ను స్టార్ ఆఫ్ ఇండియా అని అభివర్ణించింది.