దేశంలో ప్రతిపక్షం లేని రాష్ట్రాలు ఎన్ని ఉన్నాయో తెలుసా..మహారాష్ట్ర అసెంబ్లీలో కూడా ప్రతిపక్ష నేత లేనట్లే అయింది.ఏదైనా పార్టీకి ప్రతిపక్ష హోదా దక్కాలంటే అసెంబ్లీలోని మొత్తం సీట్లలో 10% గెలుచుకోవాలి.దేశంలో ప్రతిపక్ష హోదా కూడా సంపాదించ లేని పార్టీలు ఉన్న రాష్ట్రాలు మహారాష్ట్రతో కలిపి 7 రాష్ట్రాలు ఉన్నాయి.మహారాష్ట్రలో 288 సీట్లకుగాను 29 సీట్లలో విజయం సాధిస్తే ప్రతిపక్ష హోదా ఇస్తారు. మహావికాస్ అఘాడీ లోని ఏ పార్టీకి అన్ని సీట్లు రాలేదు. శివసేన (UBT) – 20, కాంగ్రెస్-16, NCP (శరద్ పవార్ )-10 స్థానాలు మాత్రమే గెలిచాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, అరుణాచల్, గుజరాత్, మణిపుర్, నాగాలాండ్, సిక్కింలలో ప్రతిపక్ష నేతలు లేరు.ఏపీలో కూటమిగెలిచిన తర్వాత వైసీపీ 11స్థానాలకే పరిమితంకావడంతో ప్రతిపక్షం లేకుండా పోయిన సంగతి తెలిసిందే.