బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం వార్ 2. ఈ సినిమాలో ఎన్టీఆర్ కీలక పాత్రలో నటిస్తుండగా.. వార్ సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న ఈ చిత్రానికి అయన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఆదిత్య చోప్రా ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుండగా.. మూవీ షూటింగ్‌లో హృతిక్‌కి గాయం అయినట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో హృతిక్, ఎన్టీఆర్ మధ్య క్రేజీ డ్యాన్స్ సీక్వెన్స్ ఉండబోతున్నట్లు మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. పాట కోసమే ఏకంగా 500 మంది డ్యాన్స్ర్లను రంగంలోకి దింపారు. అయితే ఈ పాటకోసం ఎన్టీఆర్‌తో కలిసి రిహార్సల్స్ చేస్తుండగా.. హృతిక్ కాలికి గాయం అయ్యింది. ఈ గాయం వలన హృతిక్‌ని డాక్టర్లు నాలుగు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. దీంతో ఈ డ్యాన్స్ షూట్ మే నెలకి వాయిదా పడింది. యశ్‌రాజ్ ఫిలింస్ స్పై యూనివర్స్‌లో భాగంగా వస్తున్న ఈ సినిమాను ఆదిత్యా చోప్రా నిర్మిస్తుండగా.. జాన్ అబ్రహాం, కియారా అద్వానీ కీలక పాత్రలలో నటిస్తున్నారు.