HomeEntertainmentకార్తీని చుస్తే నాకు అసూయ.. సూర్య

కార్తీని చుస్తే నాకు అసూయ.. సూర్య

త‌న త‌మ్ముడు..హీరో కార్తీని చూస్తే త‌న‌కి అసూయ క‌లుగుతుంద‌న్నారు త‌మిళ‌ స్టార్ హీరో సూర్య.ఆయ‌న ప్ర‌ధాన పాత్ర‌ల్లో నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా కంగువ . శివ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ సూర్య 42 ప్రాజెక్ట్‌గా వస్తోంది. స్టూడియో గ్రీన్-యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ ౩డీ ఫార్మాట్‌లో సందడి చేయనుంది. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి కంగువ గ్లింప్స్‌తో పాటు పోస్ట‌ర్‌లు విడుద‌ల చేయ‌గా.. ప్రేక్ష‌కుల నుంచి మంచి రెస్పాన్స్ ద‌క్కించుకుంది. ఈ సినిమాను నవంబ‌ర్ 14న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్ర‌బృందం ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే.

అయితే ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా బిగ్ బాస్ తెలుగు సీజ‌న్ 8లో ఎపిసోడ్‌లో నాగార్జున‌తో క‌లిసి పాల్గోన్నాడు. అయితే ఈ షోలో సూర్యను చూసి ఇంత చ‌క్క‌గా మాట్లాడుతున్నావు తెలుగు అని అన‌గా.. సూర్య మాట్లాడుతూ.. స‌ర్ నాకు కొంచెం మాత్రమే వ‌చ్చు. నేను పూర్తిగా మాట్లాడ‌లేను. ఈ విష‌యంలో నాకు కార్తీని చూస్తే నిజంగా ఈర్ష్య, అసూయ కలుగుతుంది. వాడు ఎంత మంచిగా తెలుగు మాట్లాడుతాడు అని. అత‌డు త‌మిళ‌నాడులో ఉన్నవారితో కూడా తెలుగులో మాట్లాడుతాడు. తెలుగులో పాట‌లు కూడా పాడ‌తాడు. అతడికి సినిమా అంటే ప్రాణం అన్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read

spot_img