తమిళనాడులోని బ్రాహ్మణులకు మద్దతుగా మాట్లాడుతూ తెలుగు ప్రజలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
తెలుగు ప్రజలపై తమిళ నటి, బీజేపీ నాయకురాలు కస్తూరి నోరు పారేసుకున్నారు.రాజుల కాలంలో అంతఃపుర మహిళలకు సేవ చేసేందుకు వచ్చిన వారే తెలుగు వారని, అలా వచ్చిన వారు ఇప్పుడు తమది తమిళ జాతి అని పెద్ద మాటలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 300 ఏళ్ల క్రితం ఒక రాజు వద్ద అంతఃపుర మహిళలకు సేవ చేసేందుకు వచ్చిన తెలుగు వారు ఇప్పుడు తమది తెలుగు జాతి అంటుంటే, మరి ఎప్పుడో ఇక్కడకు వచ్చిన బ్రాహ్మణులను తమిళులు కాదని చెప్పేందుకు మీరెవరంటూ ద్రవిడ సిద్ధాంత వాదులను పరోక్షంగా ప్రశ్నించారు. ఇతరుల ఆస్తులను లూటీ చేయవద్దని, ఇతరుల భార్యలపై మోజుపడొద్దని, ఒకరికంటే ఎక్కువ మంది భార్యలను చేసుకోవద్దని బ్రాహ్మణులు చెబుతుండటంతోనే తమిళనాడులో వారికి వ్యతిరేకంగా ప్రచారం జరుగుతోందని కస్తూరి ఆరోపించారు.
https://twitter.com/KasthuriShankar/status/1853307798400237722