HomeSportsఫిట్ గా ఉన్నా ..మ‌హ్మ‌ద్ ష‌మీ

ఫిట్ గా ఉన్నా ..మ‌హ్మ‌ద్ ష‌మీ



తాను వంద‌కి వంద‌శాతం ఫిట్ గా ఉన్నాన‌ని చెప్పాడు స్టార్ పేస‌ర్ మ‌హ్మ‌ద్ ష‌మీ. గ‌తేడాది స్వ‌దేశంలో జ‌రిగిన వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ లో గాయ‌ప‌డ్డాడు ష‌మీ. ఎట్ట‌కేల‌కు తాను పూర్తిగా కోలుకున్నాన‌ని వెల్ల‌డించాడు.ఈ మేర‌కు అభిమానుల‌కి ఒక మెసేజ్ పంపాడు.తాను వంద‌కు వంద‌శాతం ఎలాంటి నొప్పి లేకుండా ఫిట్‌గా ఉన్న‌ట్లు పేర్కొన్నాడు.   గ‌తేడాది చీలమండ గాయం కారణంగా స‌ర్జ‌రీ చేయించుకున్న ష‌మీ అప్ప‌టి నుంచి పూర్తిగా క్రికెట్‌కు దూర‌మ‌య్యాడు. ఇటీవ‌లే ప్రాక్టీసు మొదలుపెట్టాడు. మ‌ళ్లీ అత‌ని మోకాళ్లలో వాపు వచ్చిందని, ఇది ష‌మీ జ‌ట్టులో పునరాగ‌మ‌నంపై ప్రభావం చూపించే అవ‌కాశం ఉందంటూ కెప్టెన్ రోహిత్ శర్మ ఇటీవ‌ల వెల్ల‌డించాడు. హిట్‌మ్యాన్ అలా చెప్పిన రోజుల వ్య‌వ‌ధిలోనే తాజాగా ష‌మీ తాను పూర్తిగా కోలుకున్న‌ట్లు చెప్పుకొచ్చాడు. నిన్న బౌలింగ్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. అంతకుముందు కేవ‌లం హాఫ్ రన్అప్‌తో బౌలింగ్ చేశాను. ఎందుకంటే నేను ఎక్కువ వ‌ర్క్‌లోడ్ తీసుకోకూడదనుకున్నాను. కానీ, నిన్న నేను పూర్తిగా స్థాయిలో మునుప‌టి ష‌మీలా బౌలింగ్ చేయాల‌ని నిర్ణయించుకున్నాను. మంచి స్పీడ్‌తో బౌలింగ్ వేశాను. ఫలితం బాగుంది. ప్ర‌స్తుతం నేను 100 శాతం నొప్పి లేకుండా ఉన్నాను. ఆస్ట్రేలియా సిరీస్‌కి అందుబాటులో ఉంటానా లేదా అని చాలా కాలంగా అందరూ ఆలోచిస్తున్నారు. అయితే దానికి ఇంకా కొంత సమయం ఉంద‌న్నాడు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read

spot_img