ఇళయరాజా రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాను మ్యూజిక్ ఇచ్చిన పలు సాంగ్స్ ద్వారా వెస్ట్రన్ క్లాసికల్ సంగీతాన్ని పరిచయం చేసి అందరికీ నేర్పించానని, మ్యూజిక్ డైరెక్టర్లకు మొజార్ట్, పోతోవన్ బంటి లాంటి పేర్లను తానే పరిచయం చేసినట్టు ఇళయరాజా చెప్పారు. తానే సింపోనిని రూపొందించినట్టు చెప్పిన ఆయన తనకు సంగీతమంటే ఎంత ఇష్టమనేది అందరూ తెలుసుకోవాలని, తాను ఇలా మాట్లాడటం కొందరికి కడుపు మంట అయినప్పటికీ నా మ్యూజిక్ అందరి జీవితాల్లో ఉందని తెలిపారు. తన సంగీతం విని ఓ బిడ్డ తిరిగి ప్రాణం పోసుకుందని, ఓ ఏనుగుల గుంపు తన సాంగ్స్ వినడానికి వచ్చాయని ఆయన ఈ సందర్భంగా అన్నారు. ఇవన్నీ చెప్పినందుకు తనకు గర్వం, పొగరు అనుకుంటారు. తను సాధించిన ఘనతకు తనకు కాకుండా వేరే వారికి ఎందుకు గర్వముంటుందని ఆయన ప్రశ్నించారు. ప్రపంచంలో ఎవరూ చేయలేని దాన్ని నేను చేశాను కాబట్టి నాకు ఆ పొగరు ఉంటుందని, టాలెంట్ ఉన్నోళ్లకే గర్వం ఉంటుందని ఇళయరాజా పేర్కొన్నారు. ఇళయరాజా మాట్లాడిన ఆ వీడియో ఇప్పుడు అంతటా వైరల్ అవుతుంది.