మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఇటీవల పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ వాహన తనిఖీల్లో 27 మంది పట్టుబడ్డారు.పట్టుబడిన వారంతా గురువారం నుంచి వారం రోజులపాటు స్థానిక మాతాశిశు సంరక్షణ కేంద్రంలో పారిశుద్ధ్య పనులు చేయాలని మంచిర్యాల కోర్టు తీర్పునిచ్చింది.