బోర్డర్ – గవాస్కర్ టోర్నమెంట్లో భాగంగా జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో భారత్ ఓటమి పాలైంది. 340 టార్గెట్‌తో బరిలోకి దిగిన ఇండియా 155 పరుగులకే ఆలౌట్ అయ్యింది. భారత బ్యాటర్లలో యశస్వి జైశ్వల్ 84 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలువగా.. పంత్ 30 పరుగులతో రాణించాడు. ఆసీస్ బౌలర్లలో కమిన్స్ మూడు వికెట్లు, బోలాండ్ 3, నాథన్ లియాన్ 2, మిచెల్ స్టార్క్, హెడ్ చెరో వికెట్ తీశారు.