అడిలైడ్ టెస్టులో భారత్ కష్టాల్లో పడింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన టీమ్‌ఇండియాకు మిచెల్ స్టార్క్ షాకిచ్చాడు. ఇన్నింగ్స్ తొలి బంతికే మంచి ఊపుమీదున్న జైస్వాల్‌ను బోల్తా కొట్టించాడు. ఎల్బీడబ్ల్యూ రూపంలో వికెట్లముందు దొరకబట్టాడు. దీంతో ఖాతా తెరవకుండానే భారత్ మొదటి వికెట్‌ను కోల్పోయింది. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన గిల్‌తో కలిసి మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే పనిలో పడ్డాడు. ఇద్దరు నిలకడగా ఆడుతూ హాఫ్ సెంచరీ భాగస్వామ్యాన్ని నమోదుచేశారు. అయితే 18.4వ ఓవర్‌లో రాహుల్‌ను మిచెల్ స్టార్క్ ఔట్ చేశాడు.
64 బాల్స్‌లో 37 రన్స్ చేసిన రాహుల్ నాథన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. గత మ్యాచ్‌లో సెంచరీ చేసి టచ్‌లోకి వచ్చిన విరాట్ కోహ్లీ మరోసారి నిరాశపరిచాడు. 8 బంతులు ఎదుర్కొన్న కోహ్లీ.. 7 రన్స్ చేసి స్టార్క్ (20.1 ఓవర్) బౌలింగ్‌లో స్టీవ్ స్మిత్‌కు క్యాచ్ ఇచ్చాడు. ఆ తర్వాతి ఓవర్‌లో గిల్ (51 బంతుల్లో 31 రన్స్) కూడా ఔటయ్యాడు. దీంతో 3 ఓవర్ల వ్యవధిలోనే ముగ్గురు టాపార్డర్ బ్యాట్స్‌మెన్ పెవిలియన్‌కు చేరడంతో టీమ్‌ఇండియా కష్టాల్లో కూరుకుపోయింది. ప్రస్తుతం రిషభ్ పంత్ (4), కెప్టెన్ రోహిత్ (1) క్రీజ్‌లో ఉన్నారు. 4 వికెట్ల నష్టానికి 82 రన్స్ చేసింది.