పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఆరు వికెట్ల తేడాతో ఇండియా ఘన విజయం సాధించింది. విరాట్ కోహ్లీ అజేయంగా సెంచరీతో అజేయుడిగా నిలిచాడు. కోహ్లీకి ఛేజింగ్ లో 28వ సెంచరీ. కోహ్లీ ఫాంలోకి రావడంతో ఈ విజయం సాధ్యమయిందని అందరూ కొనియాడారు. కాగా శ్రేయాస్ అయ్యర్ హాఫ్ సెంచరీతో అలరించాడు. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లో రాణించిన టీమిండియా చాంపియన్స్ ట్రోఫీలో రెండో విజయాన్ని నమోదు చేసింది. పాక్ విధించిన లక్ష్యాన్ని టీమిండియా 42.3 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 244 పరుగులు చేసింది. ఐసీసీ టోర్నీలో మరోసారి పాక్‌పై టీమిండియా ఎదురేలేదని నిరూపించింది. ఈ ఓటమితో పాకిస్తాన్ చాంపియన్స్ ట్రోఫీ నుంచి దాదాపుగా వైదొలిగినట్లే.
