HomeSportsతొలి తరం దిగ్గజ క్రికెటర్ ..సయ్యద్ అబిద్ అలీ కన్నుమూత‌

తొలి తరం దిగ్గజ క్రికెటర్ ..సయ్యద్ అబిద్ అలీ కన్నుమూత‌

భారత మాజీ ఆల్ రౌండర్, తొలి తరం దిగ్గజ క్రికెటర్ సయ్యద్ అబిద్ అలీ కన్నుమూశారు. ఆయన వయసు 83 సంవత్సరాలు. హైదరాబాద్ కు చెందిన అలీ… కెరీర్ అనంతం అమెరికాలోని కాలిఫోర్నియాలో స్థిరపడ్డారు. అనారోగ్య కారణాలతో ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన బంధువు రెజా ఖాన్ వెల్లడించారు. అలీ మృతి పట్ల టీమిండియా మాజీ క్రికెటర్లు సంతాపం ప్రకటించారు. 1967-74 మధ్య భారత జట్టుకు అలీ ప్రాతినిధ్యం వహించారు. 1974 జులై 13న లీడ్స్ లో ఇంగ్లండ్ తో ఇండియా తొలి వన్డే మ్యాచ్ ఆడింది. ఆ మ్యాచ్ లో భారత్ తరపును తొలి బంతిని వేసిన అబిద్ అలీ చిరస్మరణీయమైన ఘనతను సొంతం చేసుకున్నారు. తన కెరీర్లో 29 టెస్టుల్లో అలీ 1,018 పరుగులు చేశారు. ఇందులో 6 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. మీడియా పేస్ బౌలర్ అయిన అలీ టెస్టుల్లో 47 వికెట్లు తీశారు. 5 వన్డేల్లో 93 పరుగులు చేసి 7 వికెట్లు తీశారు. 1975లో జరిగిన వన్డే ప్రపంచ కప్ లో న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో 98 బంతుల్లో 70 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచారు. అదే ఆయనకు చివరి వన్డే కావడం గమనార్హం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read