ఏపీ రాజధాని అమరావతిలో అంతర్జాతీయ గోల్ఫ్ కోర్స్ ఏర్పాటుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది.రెండు ఏళ్లలో 150 ఎకరాల విస్తీర్ణంలో దీనిని నిర్మించేందుకు ప్రయత్నిస్తోంది. కొండపల్లి, మూలపాడుతో పాటు రాజధాని ప్రాంతాల్లో కూడా స్థలాన్వేషణ చేస్తోంది. దీని బాధ్యత ను ఏసీఏ అధ్యక్షుడు కేశినేని చిన్నికి
అప్పగించింది. కాగా ఇటీవల సీఎం చంద్రబాబుతో భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ గోల్ఫ్ కోర్స్ ఏర్పాటుపై చర్చించిన సంగతి తెలిసిందే.