ఐపీఎల్ 2025లో ధోని ఆడనున్నాడు.మహేంద్ర సింగ్ ధోనీ రాబోయే ఐపీఎల్‌లో ఆడనున్నాడని చెన్నై సూపర్ కింగ్స్ సీఈఓ కాశీ విశ్వనాథన్ ధృవీకరించారు. ధోనీ ఆడేందుకు సిద్ధమైనప్పుడు ఇంతకంటే ఏం కావాలంటూ కాశీ విశ్వనాథన్ అన్నారు. దీంతో సీఎస్‌కే జట్టులో ధోనీ స్థానం ఖాయమైంది. దీంతో పాటు అన్‌క్యాప్‌డ్ ప్లేయర్‌ల జాబితాలో అతడిని కొనసాగించనున్నట్లు సమాచారం. అంటే కేవలం రూ.4 కోట్లకే ధోనిని జట్టులో ఉంటాడు.
IPL మెగా వేలం నిబంధనల ప్రకారం, 5 సంవత్సరాల పాటు అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉన్న ఆటగాళ్లను అన్‌క్యాప్డ్ ప్లేయర్‌ల జాబితాలో చేర్చవచ్చు. దీని ప్రకారం, ధోనీ రిటైర్మెంట్‌తో 5 సంవత్సరాలు గడిచాయి. తద్వారా మహేంద్ర సింగ్ ధోనిని అన్‌క్యాప్డ్ జాబితాలో సీఎస్‌కే కొనసాగించనున్నట్లు సమాచారం. ఇక్కడ అన్‌క్యాప్డ్ ప్లేయర్‌ల జాబితాలో అట్టిపెట్టుకునే ఆటగాళ్లకు కేవలం రూ.4 కోట్లు మాత్రమే చెల్లిస్తారు. ఇప్పుడు ధోనీని రిటైన్ చేసుకోవడానికి అంగీకరించడంతో చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ కేవలం రూ.4 కోట్లకే స్టార్ ప్లేయర్‌ను జట్టులో ఉంచుకోగలుగుతుందన్నమాట.