హైదరాబాద్ :తెలంగాణలో పనిచేస్తున్న ముగ్గురు ఐపీఎస్ అధికారులను ఆంధ్రప్రదేశ్లో శనివారం రిపోర్ట్ చేయాలని కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. రహదారిభద్రత అథారిటీ ఛైర్మన్ అంజనీకుమార్(1990), తెలంగాణ పోలీసు అకాడమీ డైరెక్టర్ అభిలాష బిస్త్ (1994), కరీంనగర్ సీపీ అభిషేక్ మహంతి(2011)లు ఏపీకి వెళ్లాలని ఉత్తర్వులు ఇచ్చింది. 2024లో నియమించిన ఖండేకర్ కమిటీ సిఫార్సుల మేరకు ఇప్పుడు ముగ్గురు ఐపీఎస్ లను ఏపీలో రిపోర్ట్ చేయాలని కేంద్ర హోంశాఖ ఆదేశించింది.