HomeEntertainment'జాట్'.. ఫ‌స్ట్ లుక్

‘జాట్’.. ఫ‌స్ట్ లుక్

బాలీవుడ్ లో ఓ మూవీ చేయ‌బోతున్నాడు టాలీవుడ్ హీరో గోపీచంద్ మ‌లినేని. బాలీవుడ్ స్టార్ యాక్టర్‌ సన్నీడియోల్ హీరోగా ఎస్‌డీజీఎం గా రాబోతున్న ఈ చిత్రానికి జాట్‌ టైటిల్‌ను ఫైనల్ చేశారు. మైత్రీ మూవీ మేకర్స్‌, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి.ఇప్పటికే మాస్ ఫీస్ట్‌ లోడింగ్‌ అంటూ మేకర్స్‌ లాంచ్ చేసిన అనౌన్స్‌మెంట్‌ పోస్టర్‌ ఇప్పటికే నెట్టింట వైరల్ అవుతోంది. ఇవాళ సాయత్రం 4:05 గంటలకు ఎక్జయిటింగ్‌, భారీ అనౌన్స్‌మెంట్‌ అంటూ కొత్త లుక్ విడుదల చేశారు. ఈ లుక్ నెట్టింట వైరల్ అవుతోంది. ఈ మూవీలో బీటౌన్‌ స్టార్ యాక్టర్ రణ్‌దీప్‌ హుడా కీలక పాత్రలో నటిస్తున్నాడు‌.ఈ మూవీకి టాలీవుడ్ మ్యూజిక్‌ డైరెక్టర్ ఎస్‌ థమన్ సంగీతం అందిస్తున్నారు. రిషి పంజాబి సినిటోగ్రాఫర్‌ కాగా.. అవినాష్‌ కొల్ల ప్రొడక్షన్‌ డిజైనర్‌గా పని చేస్తున్నారు. కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా వస్తోన్న ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలపై మేకర్స్ రాబోయే రోజుల్లో క్లారిటీ ఇవ్వనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read

spot_img