ఏపీలో సరస్వతి ఇండస్ట్రీస్ కు అనుమతుల విషయంలో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లుగా ఆధారాలు వెలుగులోకి వస్తున్నాయి. జగన్ సీఎం అయ్యాక అడ్డగోలుగా గనులు, నీరు కేటాయించుకున్నారు. రూ.1300 కోట్ల విలువైన గనులను కుటుంబ సభ్యులకు జగన్ కేటాయించుకున్నారు. కంపెనీ బైలాస్ లో మార్పులు జరగకముందే మైనింగ్ లీజుల ఆమోదించారు. అధికారం అడ్డుపెట్టుకుని లీజుల కాలపరిమితి పెంచుకున్నట్లుగా తేలింది. ఇందు కోసం కోర్టుకు కూడా తప్పుడు సమాచారం ఇచ్చారు.కోర్టును తప్పుదోవ పట్టిస్తూ 25 ఎకరాల అటవీ భూమిి కాజేసే ప్రయత్నం చేశారు. అదే సమయంలో కోర్టును తప్పుదోవ పట్టించడం ద్వారా లీజు గడువు పెంచుకున్నారు. ప్రభుత్వ భూమి లేదని చెప్పారు. లీజు పునరుద్ధరణ జీవో జారీ కాకుండానే జగన్ కంపెనీలకు నీటి కేటాయింపులు.చేశారు భూ విస్తీర్ణాలకు సంబంధించి ఇష్టానుసారం మార్పులు, చేర్పులు చేసినట్లుగా గుర్తించారు. వేమవరం గ్రామంలో కేటాయించబడిన 145.2 హెక్టార్ల భూమిని.. 202.2 హెక్టార్లుగా మార్పు చేస్తూ జీవో ఇచ్చేశారు.