HomePoliticalభూమిపూజ కార్యక్రమానికి ..జగన్ ను ఆహ్వానించిన పీఠాధిపతులు

భూమిపూజ కార్యక్రమానికి ..జగన్ ను ఆహ్వానించిన పీఠాధిపతులు

వైసీపీ అధినేత జగన్ ను కర్ణాటక విజయనగర జిల్లా నందీపుర పీఠాధిపతులు కలిశారు. తాడేపల్లిలోని వైసీపీ ప్రధాన కార్యాలయంలో వీరు జగన్ ను కలిశారు. ఏప్రిల్ 30న నందీపురలో ప్రపంచంలోనే ఎత్తైన 108 అడుగుల శ్రీ అర్ధనారీశ్వరస్వామి విగ్రహం ఏర్పాటుకు భూమి పూజను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేయాలని కోరుతూ జగన్ కు పీఠాధిపతులు ఆహ్వానపత్రికను అందజేశారు.జగన్ ను కలిసిన వారిలో పీఠాధిపతులు మహేశ్వర స్వామీజీ (నందీపుర), పంచాక్షరి శివాచార్య స్వామీజీ (హీరే మఠం, బెన్నిహళ్లి), జడేశ్వర తాత (శక్తిపీఠం, వీరాపుర), కృష్ణపాద స్వామీజీ (భుజంగ నగర్, సండూర్) ఉన్నారు. ఈ సందర్భంగా అక్కడ వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి, వైసీపీ ఎమ్మెల్సీ మధుసూదన్, అర్ధనారీశ్వర ఫౌండేషన్ వ్యవస్థాపకులు రామ చైతన్య, కో ఫౌండర్ వీరేశ్ ఆచార్య కూడా ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read