నేడు ఇడుపులపాయకి వెళ్లారు వైఎస్ జగన్. పార్టీ శ్రేణులు ఆయనకు ఘనస్వాగతం పలికాయి. జగన్.. ఇడుపులపాయలోని వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. తండ్రి విగ్రహానికి పూలమాల వేసి అంజలి ఘటించారు.అనంతరం పులివెందుల బయల్దేరి వెళ్లారు. జగన్ తన సొంత నియోజకవర్గం పులివెందులలో మూడ్రోజుల పాటు కార్యకర్తలకు, ప్రజలకు అందుబాటులో ఉంటారు. జగన్ ఇడుపులపాయ పర్యటనకు సంబంధించిన ఫొటోలను మాజీ మంత్రి విడదల రజని సోషల్ మీడియాలో పంచుకున్నారు.తండ్రికి నివాళులర్పిస్తున్న జగన్ పై ట్రోల్స్ జరుగుతున్నాయి.ఎందుకు నాన్న నన్ను ఓడిపోయేలా చేశావ్ అంటు కామెంట్స్ వినిపిస్తున్నాయి..