HomePoliticalత‌ల్లి ..చెల్లిపై జ‌గ‌న్ కేసు

త‌ల్లి ..చెల్లిపై జ‌గ‌న్ కేసు

వైసీపీ అధినేత జగన్ తమ కుటుంబ ఆస్తుల వ్యవహారంలో నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ (ఎన్సీఎల్టీ) లో పిటిషన్ దాఖలు చేయడం తెలిసిందే. ఈ పిటిషన్ లో ఆయన తన తల్లి విజయమ్మ, చెల్లి షర్మిలను ప్రతివాదులుగా పేర్కొనడం సంచలనం సృష్టించింది. తనకు సమాచారం అందించకుండా తల్లి, సోదరి షేర్లు బదిలీ చేసుకున్నారని జగన్ తన పిటిషన్ లో ఆరోపించారు. షేర్ల బదిలీ ఫారాలు సమర్పించకుండానే తమ పేరిట మార్చుకున్నారని వివరించారు.

జగన్, వైఎస్ భారతి, క్లాసిక్ రియాలిటీ పేరిట షేర్లు కొనసాగేలా ఆదేశాలు ఇవ్వాలని తన పిటిషన్ లో కోరారు. 51.01 శాతం షేర్లు యథావిధిగా కొనసాగేలా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. , ఎన్సీఎల్టీ ఈ పిటిషన్ పై నేడు విచారణ చేపట్టింది. వాదనల సందర్భంగా… కౌంటర్ దాఖలు చేసేందుకు కొంత సమయం కావాలని విజయమ్మ, షర్మిల తరఫు న్యాయవాది ఎన్సీఎల్టీని కోరారు. అనంతరం, ఎన్సీఎల్టీ విచారణను డిసెంబరు 13కు వాయిదా వేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read

spot_img