HomePoliticalప‌వ‌న్‌ ఢిల్లీ వెళ్లింది రాష్ట్ర ప్రయోజనాల కోసమే..

ప‌వ‌న్‌ ఢిల్లీ వెళ్లింది రాష్ట్ర ప్రయోజనాల కోసమే..

త‌న‌కు రాజ్య‌స‌భ సీటు విష‌య‌మై ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో చ‌ర్చించార‌న్న వార్త‌ల‌పై జ‌న‌సేన నేత నాగ‌బాబు తాజాగా ‘ఎక్స్’ (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా స్పందించారు. ఈ సంద‌ర్భంగా మెగా బ్ర‌ద‌ర్ ఆస‌క్తిక‌ర ట్వీట్ చేశారు. అతను స్వార్థం తెలియని ప్రజానాయకుడు. అతని ప్రతి పని ప్రజా శ్రేయస్సు కోసమే. వ్యక్తిగత స్వార్థానికి అతనెప్పుడు దూరంగానే ఉంటాడు. అతను ఎప్పుడు సత్యానికి, ధర్మానికి కట్టుబడి ఉంటాడు. మన రాష్ట్ర బంగారు భవిష్యత్తు కోసం ఎంతవరకైనా వెళ్లి పోరాడుతాడు. ఢిల్లీ వెళ్లింది మన రాష్ట్ర ప్రయోజనాల కోసమే. వ్య‌క్తిగ‌త‌ స్వార్థ ప్రయోజనాల కోసం కాదు. అలాంటి నాయకుడి కోసం నా లైఫ్‌ని ఇవ్వడానికి నేనెప్పుడూ సిద్ధంగా ఉంటాను. నా నాయకుడికి సేవ చేయడం తప్ప నాకు వేరే రాజకీయ ఆశయం లేదు” అని నాగ‌బాబు ట్వీట్ చేశారు. ఇప్పుడీ ట్వీట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. దీనిపై జ‌న‌సైనికులు త‌మ‌దైన శైలిలో స్పందిస్తున్నారు.

https://twitter.com/NagaBabuOffl/status/1862340756062585337

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read

spot_img