HomePoliticalజేసీ దివాక‌ర్ రెడ్డి.. బ‌యోపిక్

జేసీ దివాక‌ర్ రెడ్డి.. బ‌యోపిక్

రాయలసీమ రాజకీయాల్లో జేసీ దివాక‌ర్ రెడ్డిది ఓ చరిత్రని చెప్పాలి. అందుకే, తెలుగు రాష్ట్రాల్లో ఆయన పేరు తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. దాదాపు యాభై ఏళ్ల రాజకీయం చేసి.. తాడిపత్రి సెంటర్‌గా అనంతపురం జిల్లా రాజకీయాల్ని శాసించిన జేసీ జీవితం ఇప్పుడు సినిమావాళ్ల చేతుల్లోకి వెళ్లబోతోందనే ప్రచారం… పొలిటికల్‌గా ఆసక్తి రేపుతోంది. ఉద్యమసమయంలో అయినా.. రాష్ట్ర విభజన తర్వాతైనా.. ఆయన పేల్చిన డైలాగ్‌ డైనమైట్లు రాజకీయంగా ఎన్నో చర్చలకు కారణమయ్యాయి. అందుకే పాలిటిక్స్‌లో ఆయనెప్పుడూ ప్రత్యేకం. అనంతపురం జిల్లా రాజకీయాల్లో తనకంటూ ఓ ముద్ర వేసుకున్న జేసీ… తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని రాజకీయ నేతగా ఎదిగారు. అయితే, ఆయన జీవితంలో వివాదాస్పద అంశాలకు కొదవలేదు. ప్రధానంగా పరిటాల రవి హత్యకుట్రలో జెసి దివాకర్ రెడ్డి ప్రమేయం ఉందంటూ వచ్చిన ఆరోపణలు.. అప్పట్లో సంచలనం రేపాయి. విచారణలో జెసి దివాకర్ రెడ్డికి క్లీన్ చిట్ అయితే వచ్చింది. అంతేకాదు, పరిటాల రవి జీవితకథగా తెరకెక్కిన రక్తచరిత్ర సినిమాలోనూ… ఎక్కడా జెసి ఫ్యామిలీకి సంబంధించిన అంశాలు చూపించలేదు.

అయితే, తాజాగా జెసి దివాకర్ రెడ్డి బయోపిక్ తీయబోతున్నట్లు ప్రచారం జరుగుతుండటంతో.. అందులో ఏం చెప్పబోతున్నారు? ఏం చూపించబోతున్నారు? అనే ఆసక్తి ఏర్పడింది. ఈ బయోపిక్‌లో అన్నీ వాస్తవాలే ఉంటాయా??? అనే చర్చ మొదలైంది. ఎందుకంటే రాయలసీమ రాజకీయాల్లో జేసీ పాత్ర తక్కువేమీ కాదు. పరిటాల కుటుంబంతో వైరం.. వైయస్ ఫ్యామిలీతో ఉన్న సంబంధాలు, విభేదాలు… ఇలా చాలా అంశాలు స్పృశించాల్సి ఉంటుంది. మరవన్నీ బయోపిక్‌లో ఉంటాయా? అన్నదే చర్చనీయాంశంగా మారింది. సీమలో ఎంత పేరున్న నాయకుడో.. అంతే వివాదాస్పదుడు జేసీ దివాకర్‌రెడ్డి. అలాంటి నాయకుడిపై సినిమా అంటే.. ఆమాత్రం క్యూరియాసిటీ ఉంటుందంటున్నారు విశ్లేషకులు.దివాకర్‌రెడ్డి పాత్రను నటకిరీటి రాజేంద్రప్రసాద్ పోషిస్తున్నారనే ముచ్చట బలంగా వినిపిస్తోంది. రాజేంద్రప్రసాద్‌కు, జేసి దివాకర్ రెడ్డికి దగ్గర పోలికలు ఉన్నందున… ఆయననే ఖాయం చేసినట్టు తెలుస్తోంది. ఇటీవల తన కూమార్తె మరణించినప్పడు.. విగ్గులేకుండా, బట్ట తలతో కనిపించిన రాజేంద్రప్రసాద్‌ను చూసి.. అచ్చం జెసి దివాకర్ రెడ్డి లాగే ఉన్నారన్న మాట కూడా బాగానే వినిపించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read

spot_img