ఎట్టకేలకు కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కి బెయిల్ దొరికింది. తాజాగా తెలంగాణ హైకోర్టు జానీ మాస్టర్‌కు బెయిల్ మంజూరు చేస్తూ.. తీర్పునిచ్చింది. జానీ మాస్టర్ అవకాశాల పేరుతో తనను బెదిరించి పలుమార్లు అత్యాచారం చేశారని ఆయన దగ్గర పనిచేస్తున్న లేడీ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గతనెల 15న నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అతడితోపాటు జానీ మాస్టర్ భార్య పేరును కూడా తన ఫిర్యాదులో పేర్కొంది. దీంతో జానీ మాస్టర్ ను అరెస్ట్ చేసిన పోలీసులు జైలుకు తరలించారు. గత రెండు వారాలుగా చంచల్‌గూడ జైల్లో ఉన్నాడు జానీమాస్టర్. బాధితురాలి వాంగ్మూలం ప్రకారం మైనర్ గా ఉన్నప్పటి నుంచే అంటే 2019 నుంచే తనపై లైంగిక దాడి జరిగిందని సదరు యువతి తెలిపింది. దీంతో అతడిపై పోక్సో కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ కేసులో ఆయనకు ఇప్పుడు బెయిల్ లభించింది.
కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ చంచల్ గూడ జైలు నుండి విడుదలైయ్యారు. లైంగిక ఆరోపణల కేసులో అరెస్ట్ అయిన జానీ మాస్టర్.. సెప్టెంబర్ 19 న అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. 36 రోజుల పాటు చంచల్ గూడా జైల్లో ఉన్నారు జానీ మాస్టర్. లైంగిక ఆరోపణల నేపథ్యంలో సెప్టెంబర్ 15న జానీ మాస్టర్ పై నార్సింగి పోలీస్ స్టేషన్‌లో కేసునమోదైన విషయం తెలిసిందే. కాగా సెప్టెంబర్ 19న జానీ మాస్టర్‌ను నార్సింగి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తన అసిస్టెంట్ పై లైంగిక దాడికి పాల్పడినట్టు పోలీసులకు ఫిర్యాదు అందింది. దాంతో జానీని పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పటి నుండి జానీ మాస్టర్ చంచల్‌గూడ జైల్లోనే ఉంటున్నారు. జానీ మాస్టర్ కు నేషనల్ అవార్డును సైతం రద్దు చేశారు. మొదట అవార్డు వచ్చిన కారణంగా రంగారెడ్డి కోర్టు మధ్యంతర బెయిలు జానీ మాస్టర్ కు మంజూరు చేసింది. కానీ లైంగిక ఆరోపణలకు వేసుకోవడంతో అవార్డును రద్దు చేస్తూ ప్రకటన విడుదల చేశారు. దీంతో జానీ మాస్టర్ కు మంజూరు అయిన మధ్యంతర బెయిల్ ను రద్దు చేయాలని పోలీసులు కోర్టును ఆశ్రయించారు ..దీంతో జానీ మాస్టర్ రంగారెడ్డి కోర్టులో రెగ్యులర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశాడు. సుదీర్ఘ వాదన తర్వాత జానీ మాస్టర్ వేసిన బెయిల్ పిటిషన్‌ను రంగారెడ్డి కోర్టు తిరస్కరించింది. కింది కోర్టు తీర్పును సవాలు చేస్తూ జానీ మాస్టర్ హైకోర్టును ఆశ్రయించాడు. కేసుకు సంబంధించిన వివరాలు పరిశీలించిన తర్వాత జానీ మాస్టర్ కు హైకోర్టు కండిషనల్ బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ మంజూరు చేస్తూ కొన్ని షరతులను విధించింది.