తమిళ స్టార్ హీరో సూర్య నటించిన చిత్రాలు టాలీవుడ్ లో కూడా హిట్ అవుతుంటాయి..పాత్ర ఏదైనా సరే దానికి న్యాయం చేయడంలో సూర్య స్టైలే వేరప్ప. ఇప్పటి వరకు ఆయన నటించని పాత్ర లేదు..ప్రతీ పాత్రకి ప్రాణంపెట్టి మరీ నటిస్తుంటారాయన. కాగా ఆయన నటించిన తాజా చిత్రం కంగువ.ఈ మూవీ ఫస్ట్ రివ్యూ కోలీవుడ్ లో వైరల్ అవుతోంది. కంగువ సినిమా పై సూర్య అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ భారీ హైప్ ను క్రియేట్ చేశాయి . ఈ చిత్రానికి సిరుత్తై శివ దర్శకత్వం వహిస్తున్నారు. రాజు కాలం నాటి కథతో రూపొందుతున్న ఈ సినిమాకు టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.ఈ చిత్రంలో సూర్య 13 డిఫరెంట్ లుక్స్‌లో కనిపించనున్నాడు. దాంతో కంగువపై భారీ అంచనాలు నెలకొన్నాయి. నవంబర్ 14న సినిమాను విడుదల చేయనున్నట్టు కంగువ మేకర్స్ ప్రకటించారు.
ఈ చిత్రం దాదాపు 2 సంవత్సరాలకు పైగా షూటింగ్ జరిగింది. స్టూడియో గ్రీన్, యువి క్రియేషన్స్ సంయుక్తంగా కంగువ చిత్రాన్ని భారీ వ్యయంతో నిర్మించాయి. 10కి పైగా భాషల్లో 3డి టెక్నాలజీలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ క్రమంలో ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ రివ్యూ విడుదలై ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. అందుకు తగ్గట్టుగానే గేయ రచయిత మదన్ కర్కీ కంగువ సినిమా గురించి తన ట్విట్టర్ పేజీలో పోస్ట్ చేశారు. అందులో కంగువ పూర్తి వెర్షన్ చూశాను. డబ్బింగ్ చెబుతున్నప్పుడు ఒక్కో సీన్‌ని వందసార్లకు పైగా చూశాను కానీ ఒక్కోసారి చూసే కొద్దీ సినిమా ప్రభావం మరింత పెరిగింది. అలాగే ఈ సినిమాలో సూర్య నటన అద్భుతంగా ఉందని పోస్ట్‌లో పేర్కొన్నారు.ఈ మూవీలో బాలీవుడ్ నటులు దిశా పఠానీ, బాబీ డియోల్, తమిళ కమెడియన్స్ కోవై సరళ, యోగి బాబు, రెడ్టిన్ కింగ్స్లీ, నటరాజన్ సుబ్రమణియన్, జగపతి బాబు, కెఎస్ రవికుమార్ తదితరులు ఈ చిత్రంలో నటించారు. మరి సినిమా రిలీజ్ అయ్యాక ప్రేక్షకులు ఎలాంటి రివ్యూ ఇస్తారో చూడాలి.