పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కీలక పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం కన్నప్ప. మంచు కుటుంబం నుంచి వస్తున్న ఈ మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌లో మంచు విష్ణు కథానాయకుడిగా నటిస్తుండగా.. దాదాపు రూ.100 కోట్ల బడ్జెట్‌తో వస్తున్న ఈ సినిమాను కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు నిర్మిస్తున్నాడు. ఏప్రిల్ 25న వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు మేకర్స్. ఈ సందర్భంగా మూవీ నుంచి సాలిడ్ అప్‌డేట్‌ని ప్రకటించింది. ఈ మూవీ నుంచి ప్రభాస్ ఫస్ట్ లుక్‌ని ఫిబ్రవరి 3న విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఈ సందర్భంగా కొత్త పోస్టర్‌ను పంచుకుంది. హిస్టారికల్ కం మైథాలాజీ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్‌తో పాటు బాలీవుడ్, కోలీవుడ్ అగ్ర తారలు నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి మహాభారతం సీరియల్ ఫేమ్ ముఖేష్‌కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి మంచు మోహన్ బాబు, మంచు విష్ణులతో పాటు పలువురు అగ్ర కథానాయకుల ఫస్ట్ లుక్‌లను విడుదల చేయగా.. మంచి రెస్పాన్స్ అందుకుంది.