భోగాపురం మండలం ముక్కాం గ్రామంలోని మంగళవారం తెలుగుదేశం పార్టీ శాశ్వత సభ్యత్వం నమోదు కార్యక్రమంలో నెల్లిమర్ల నియోజకవర్గం టిడిపి ఇన్చార్జ్ & ఏపీ మార్క్ ఫెడ్ చైర్మన్ కర్రోతు బంగార్రాజు పాల్గొన్నారు. బంగార్రాజు మత్స్యకారుల వద్దకు వెళ్లి సభ్యత్వంపై వారికి అవగాహన కల్పిస్తూ శాశ్వత సభ్యత్వం రూ. లక్ష రూపాయలు.సాధారణ సభ్యత్వ నమోదుకు రూ.100 రూపాయలు రుసుము చెల్లించి నమోదు చేసుకోవాలన్నారు.సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికి ప్రమాద బీమా ద్వారా ఐదు లక్షల ఇన్సూరెన్స్ వర్తిస్తుందని తెలియజేశారు. వారి కుటుంబ సభ్యులకు విద్యా వైద్యం ఉపాధి అవకాశాలు కల్పించడంలో పార్టీ అండగా ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ గనగల్ల బాబాజీ ,టీడీపీ నాయకులు బడి నాయుడు , గరికిన రాము ,అప్పన్న మరియు తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.