జిల్లా కేంద్రంలో గత కొన్ని దొంగతనాల్లో కీలక పాత్ర వహించిన అంతరాష్ట్ర దొంగ వికారాబాద్ కు చెందిన కావలి సురేందర్ అలియాస్ శ్రీధర్ ను అరెస్టు చేసినట్లు పట్టణ ఎస్ఐ కళ్యాణ్ కుమార్ తెలిపారు… కావలి సురేందర్ గత కొంతకాలంగా కృష్ణారెడ్డి మెడికల్ దుకాణం తోపాటు మరికొన్ని కేసులలో పాల్గొన్నారు… సురేందర్ ను అరెస్టు చేసి మూడు దొంగతనాలకు సంబంధించి రూ 72వేలు నగదును రికవరీ చేయడం జరిగింది. గద్వాల సీఐ తో పాటు పట్టణ ఎస్ఐ కళ్యాణ్ కుమార్ మరియు కానిస్టేబుల్ చందు ఇస్మాయిల్ పాల్గొన్నారు..