నేషనల్ అవార్డు విన్నింగ్ బ్యూటీ కీర్తి సురేశ్ తెలుగు, తమిళం, హిందీలో వరుస చిత్రాలతో బిజీగా మారిపోయింది. ఇటీవలే తన చిన్ననాటి మిత్రుడు ఆంటోనీ తట్టిల్ ను కీర్తి ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. గతేడాది డిసెంబర్లో గోవాలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు. పెళ్లి అనంతరం వేడుకకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటోంది. తన ప్రీ వెడ్డింగ్‌కు సంబంధించిన అద్భుతమైన ఫొటోలను కీర్తి షేర్ చేసింది. ‘తమిళ్ అమ్మాయి’ అంటూ సంగీత్, మెహందీ ఫోటోలను పంచుకుంది. ఈ వేడుకల్లో కీర్తి ఎంతో జాయ్‌ఫుల్‌గా కనిపించింది. తన భర్త ఆంటోనీతో ఆటోలో వచ్చిన ఈ బ్యూటీ డ్యాన్స్ చేసి ఆకట్టుకుంది. సంగీత్ సందర్భంగా కీర్తి ధరించిన డ్రెస్ మరింత ఆకర్షణీయంగా కనిపించింది. ఈ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.