HomeEntertainmentకిరాక్ పార్టీని మ‌ర‌చిపోలేను..ర‌ష్మిక‌

కిరాక్ పార్టీని మ‌ర‌చిపోలేను..ర‌ష్మిక‌

కిరాక్ పార్టీ సినిమా విడుద‌ల డేట్ త‌న‌కి ప్ర‌త్యేక‌మ‌నిచెప్పింది న‌టి ర‌ష్మిక మంద‌న‌.. ఇటీవల రష్మిక పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో ఇన్నాళ్ల జీవితంలో మీకు గర్తుండిపోయిన మధుర జ్ఞాపకం ఏంటి? అనే ప్రశ్న రష్మికకు ఎదురైంది. దానికి ఆమె సమాధానమిస్తూ.. ‘2016 డిసెంబర్‌ 30.. ఆ రోజును నా జీవితంలో మరిచిపోలేను. ఎందుకంటే.. నా తొలి సినిమా ‘కిరాక్‌ పార్టీ’ విడుదలైంది ఆ రోజే. ఆ సినిమాతో నా జీవితమే మారిపోయింది. ఆ సినిమాతో కన్నడలో బిజీ అయ్యాను. నా టాలీవుడ్‌ డెబ్యూ ‘చలో’ సినిమా ఛాన్స్‌ నాకొచ్చిందంటే.. కారణం ‘కిరాక్‌ పార్టీనే’. ఆ సినిమా చూసే ‘చలో’లో నన్ను తీసుకున్నారు. ఆ తర్వాత నా కెరీర్‌ సమూలంగా మారిపోయింది. ఇప్పుడంతా నన్ను నేషనల్‌ క్రష్‌ అంటున్నారంటే.. దాని వెనుక ‘కిరాక్‌ పార్టీ’ సినిమానే ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read

spot_img