యువ నటుడు కిరణ్ అబ్బవరం ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘దిల్ రుబా . ఈ సినిమాకి విశ్వ కరుణ్ దర్శకత్వం వహిస్తుండగా.. రవి, జోజో, జోస్, రాకేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. రుక్సర్ థిల్లాన్ కథానాయికగా నటిస్తుండగా.. మార్చి 14న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్‌లో పాల్గోంటుంది చిత్రయూనిట్. అయితే ఈ సినిమా ప్రమోసన్స్‌లో భాగంగా ఆసక్తికర ప్రకటనను చేశాడు కిరణ్. ‘దిల్ రుబా’ సినిమా కథ చెబితే ఈ సినిమాలో వాడిన బైక్‌ను గిప్ట్‌గా ఇస్తానంటూ ప్రకటించాడు. నా ప్రేమ, కోపం సమ్మేళనంగా తెరకెక్కిన చిత్రమే ‘దిల్ రూబా’. ఈ సినిమాలో వాడిన బైక్ అంటే నాకు చాలా ఇష్టం. మా ఆర్ట్ డైరెక్టర్ ఈ బైక్‌ని చాలా కష్టపడి ప్రత్యేకంగా తీర్చిదిద్దాడు. బయట ఎక్కడ ఇలాంటి బైక్ కనిపించదు. ఇంత ఇష్టమైన బైక్‌ని మీకు గిప్ట్‌గా ఇచ్చేద్దాం అనుకుంటున్నా. ఈ బైక్ మీరు సొంతం చేసుకోవాలి అంటే మీరు చేయాల్సింది ఒక్కటే. ఇప్పటివరకూ విడుదలైన దిల్ రూబా పాటలు కావచ్చు, వీడియోలు కావచ్చు, ప్రమోషన్స్‌లో మేము మాట్లాడిన విషయాలు కావచ్చు. వీటిని ఆధారంగా చేసుకుని ఈ సినిమా కథ ఏమిటనేది మీరు ఆలోచించి చెప్పాలి. మోస్ట్ క్రియేటివ్‌గా ఎవరైతే చెబుతారో వారికి ఈ బైక్‌ని దిల్ రూబా సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో ఇస్తాను. అంతేగాకుండా ఈ కంటెస్ట్ గెలిచిన వారితో దిల్ రూబా ఫస్ట్ డే ఫస్ట్ షో కలిసి చూస్తాను అంటూ కిరణ్ చెప్పుకోచ్చాడు.