HomeEntertainmentతిరుమ‌ల‌లో కిర‌ణ్ అబ్బ‌వ‌రం

తిరుమ‌ల‌లో కిర‌ణ్ అబ్బ‌వ‌రం

తిరుమల వేంకటేశ్వర స్వామివారిని టాలీవుడ్ యువ న‌టుడు కిర‌ణ్ అబ్బ‌వ‌రం ద‌ర్శించుకున్నారు. ఆదివారం ఉదయం వీఐపీ బ్రేక్‌ సమయంలో శ్రీవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో ఆలయ పండితులు కిర‌ణ్‌కు వేదాశీర్వచనం అందించగా, అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సంద‌ర్భంగా ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ.. శ్రీవారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు.

త‌న క సినిమా విడుద‌ల సంద‌ర్భంగా ఈ సినిమా మంచి విజ‌యం సాధించాల‌ని కోరుకున్న‌ట్లు కిర‌ణ్ వెల్ల‌డించారు. కిర‌ణ్ అబ్బ‌వ‌రం ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న తాజా చిత్రం ‘క .ఈ చిత్రం దీపావ‌ళి కానుక‌గా అక్టోబ‌ర్ 31న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సినిమాలో న‌య‌న్ సారిక క‌థానాయిక‌గా న‌టిస్తుంది. ఈ సినిమాకు సుజీత్, సందీప్ ఇద్దరు దర్శకులు సంయుక్తంగా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా.. కిరణ్ శ్రీమతి రహస్య గోరక్ పర్యవేక్షిస్తున్నారు. కిర‌ణ్ అబ్బ‌వ‌రం సోంత బ్యాన‌ర్‌పై వ‌స్తున్న ఈ సినిమాను చింతా గోపాలకృష్ణ రెడ్డి భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read

spot_img