టీమిండియా ఆటగాడు విరాట్ కోహ్లీ వన్డేల్లో 14వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. వన్డేల్లో వేగంగా 14వేల పరుగులు చేసిన క్రికెటర్‌గా ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. కోహ్లీ 287 వన్డే ఇన్నింగ్స్‌లో 14వేలు పూర్తి చేసి.. టీమిండియా దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ రికార్డును అధిగమించాడు. చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా పాకిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 15 పరుగుల వ్యక్తిగత స్కోర్ చేసి.. ఈ మైలురాయిని అందుకున్నాడు. హారిస్ రవూఫ్ బోలింగ్‌లో ఫోర్ కొట్టిన విరాట్.. టీమిండియా మాజీ ప్లేయర్ సచిన్, శ్రీలంక ఆటగాడు కుమార సంగక్కరను అధిగమించాడు.
సచిన్ టెండూల్కర్ 350 వన్డేల్లో ఈ ఘనత సాధించాడు. విరాట్ 287 వన్డేల్లోనే ఈ ఘనతను అందుకున్నాడు. వన్డేల్లో 14వేల కంటే ఎక్కువ పరుగులు చేసిన మూడో ఆటగాడిగా విరాట్ నిలిచాడు. వన్డేల్లో అత్యధిక పరుగులు పరుగులు చేసిన ప్లేయర్ సచిన్ రికార్డులకెక్కాడు. 463 వన్డేల్లో 44.8 సగటుత 18,426 పరుగులు చేశాడు. ఇందులో 49 సెంచరీలు, 96 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక శ్రీలంక ఆటగాడు కుమార సంగక్కర 404 వన్డేల్లో 42 సగటుతో 18,048 పరుగులు చేశాడు. ఇందులో 25 సెంచరీలు, 93 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. విరాట్ కోహ్లీ మొత్తం 299 మ్యాచుల్లో 57.8 సగటుతో 14వేల పరుగులు చేశాడు. ఇందులో 50 సెంచరీలు, 73 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.