కుంభమేళాలో సందడి చేసింది. మిల్కీ బ్యూటీ తమన్నా.. ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగరాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళాకు హాజరైంది. తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి కుంభమేళాకు విచ్చేసిన తమన్నా… త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానం ఆచరించింది. ఈ సందర్భంగా తమన్నా కుటుంబ సభ్యులు సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. యూపీ ప్రభుత్వం అత్యంత ఘనంగా నిర్వహిస్తున్న కుంభమేళాకు ఇప్పటివరకు 60 కోట్ల మంది భక్తులు హాజరైనట్టు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ఈ నెల 26తో కుంభమేళా ముగియనుండడంతో… దేశవిదేశాల నుంచి వస్తున్న భక్తులతో రద్దీ మరింత పెరిగింది.