తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ క్రేజ్ ఉన్నటువంటి టాప్ మోస్ట్ స్టార్స్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే తెలియని ఎవరూ ఉండరు. అయితే హీరో గానే కాకుండా పవన్ కళ్యాణ్ అంటే వ్యక్తిగా కూడా ఎంతోమంది అభిమానిస్తారు.అయితే తనపై విమర్శలు కూడా లేకపోలేవు. అయినప్పటికీ పవన్ వాటిని అన్నిటిని ఎదుర్కొని ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇండియా వైడ్ గా కూడా పవర్ఫుల్ వ్యక్తిగా మారారు.కాగా ఇపుడు పవన్ కళ్యాణ్ సినిమాలు కాకుండా తనకి ఇష్టమైన రాజకీయాల్లో కూడా అయ్యిన సంగతి తెలిసిందే. కాగా ఇపుడు పవన్ కళ్యాణ్ పదేళ్ల పాటు రాజకీయల్లో కొనసాగి ఇపుడు ఫైనల్ గా సీఎం తర్వాత అంతటి సీఎం ఉప ముఖ్యమంత్రి పదవిలో అదరగొడుతున్నారు. దీనితో తెలుగు సినిమా నుంచి కూడా ఒక స్టార్ రాజకీయాల్లో అది కూడా ఉన్నత పదవిలో ఉన్నారు అంటే అది ఖచ్చితంగా తెలుగు ఇండస్ట్రీ పెద్దలు కూడా ఆనందం వ్యక్తం చేశారు.
ఇక ఇదిలా ఉండగా ఇన్ని రోజులు బాగానే ఉంది కానీ పవన్ ఇపుడు పలు సంచలన వార్తలు మొదలయ్యాయి. పవన్ కళ్యాణ్ ఆంధ్ర రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి కాదు ముఖ్యమంత్రి కాబోతున్నారా? అనే ప్రశ్నలు సంచలనంగా మారాయి. కాగా ఎప్పుడు నుంచో పవన్ కళ్యాణ్ సీఎం కావాలని అభిమానులు కోరుకుంటున్నారు. మొన్న ఎన్నికల సమయంలో కూడా గెలిస్తే రెండున్నరేళ్లు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా ఉండాలని కూడా వారు డిమాండ్ చేశారు.కానీ పవన్ పలు కీలక శాఖల మంత్రిత్వం సహా ఉప ముఖ్యమంత్రిగా చేశారు. దీనితో అక్కడ నుంచి పవన్ కళ్యాణ్ పేరు తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాకుండా నేషనల్ వైడ్ గా కూడా తన బ్రాండ్ వేసుకున్నారు. ఇక ఇదిలా ఉండగా ఇపుడు పవన్ కళ్యాణ్ సీఎం అనే మాట ఊపందుకుంది. చంద్రబాబు నాయుడు వయస్సు రీత్యా సెంట్రల్ లో ఉప రాష్ట్రపతి కావచ్చని లేదా ఎన్డీయే నిర్ణయంతో గౌరవ గవర్నర్ గా మారుతారని పుకార్లు వినిపిస్తున్నాయి.
ఇవి కాకుండా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా మారితే చంద్రబాబు సలహాలు సూచనలు నేతృత్వంలో పవన్ ముఖ్యమంత్రిగా కొనసాగుతారు అంటూ పలు షాకింగ్ వార్తలు వైరల్ గా మారాయి. కాగా దీనిపైనే మరో వెర్షన్ కూడా వినిపిస్తుంది. గతంలో కూడా పవన్ సపోర్ట్ తో టీడీపీ అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. కానీ అపుడు పవన్ ని వారు పక్కన పెట్టేసారు.ఇప్పుడు కూడా నెమ్మదిగా నారా లోకేష్ ని పవన్ స్థానం ఇవ్వాలని మెల్లగా ఒక మాట స్టార్ట్ చేసి పవన్ పదవికి ఎసరు పెట్టే యత్నం చేస్తున్నారని పవన్ ఫ్యాన్స్ అంటున్నారు. ఈ నేపథ్యంలో ఓకే సరే నారా లోకేష్ ఉపముఖ్యమంత్రి అవ్వనివ్వండి అయితే అది పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయ్యాక అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీనితో ఈ రెండు వెర్షన్ లు కూడా ఇపుడు సినీ ప్లస్ రాజకీయ వర్గాల్లో కూడా పెద్ద సంచలన టాపిక్ గా మారిపోయాయి. మరి పవన్ సహా చంద్రబాబు సైడ్ నుంచి ఏమన్నా వీటిపై క్లారిటీ వస్తుందేమో చూడాలి.