ప్రతి సంవత్సరం నవంబరు 19న అంతర్జాతీయ పురుషుల దినోత్సవం జరుపుకుంటారు. నేడు అంతర్జాతీయ పురుషుల దినోత్సవం కావడంతో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. లింగ వివక్ష ధోరణికి వ్యతిరేకంగా… స్త్రీ, పురుష సమానత్వాన్ని తన ట్వీట్ లో హైలైట్ చేశారు. ఇతరుల పట్ల గౌరవం, సానుభూతి ప్రదర్శించడం, బలమైన వ్యక్తిత్వం కలిగి ఉండడం పురుషుడికి ఉండాల్సిన నికార్సయిన లక్షణాలు. తన ప్రతి చర్యలోనూ కరుణను నింపడమే కాకుండా, సమానత్వం కోసం గట్టిగా నిలబడగలిగినవాడే నిజమైన మగవాడు. ఇవాళ ఇంటర్నేషనల్ మెన్స్ డే సందర్భంగా నాతో చేయి కలపండి. ఆధునిక కాలంలో మగవాళ్లు ఎలా ఉండాలన్నది పునర్ నిర్వచిద్దాం…. అందుకోసం ‘మర్ద్’ సంస్థతో కలిసి పనిచేద్దాం అని మహేశ్ బాబు తన ట్వీట్ లో పేర్కొన్నారు. మర్ద్’ సంస్థ అత్యాచారాలకు, వివక్షకు వ్యతిరేకంగా పోరాడే పురుషులకు, లింగ సమానత్వం కోసం ఉద్యమించే వారికి వేదికగా నిలుస్తోంది.