మంచు కుటుంబంలో విభేదాలు సినీ ఇండస్ట్రీతోపాటు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఇన్ని రోజులూ గుట్టుగా సాగిన ఇంటి గొడవలు కాస్తా రచ్చకెక్కాయి. పోలీసు కేసులు, ఘర్షణలకు దారితీశాయి. మంగళవారం జల్‌పల్లిలోని మోహన్ బాబు ఇంటి వద్ద హైడ్రామా కొనసాగింది. ఈ క్రమంలో రాత్రి అక్కడికి వెళ్లిన జర్నలిస్టులపై మోహన్ బాబు దాడి చేయడం ఉద్రిక్తతకు దారి తీసింది. దాడి అనంతరం మోహన్ బాబు సైతం ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన మానసిక స్థితి సరిగా లేదని వైద్యులు తెలిపారు. ఈ పరిణామాల నేపథ్యంలో మోహన్‌బాబు కూతురు మంచు లక్ష్మి పెట్టిన ఇన్‌స్టా పోస్ట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. తన ఫిట్‌నెస్, డైలీ రొటీన్, కుమార్తెకు సంబంధించిన విశేషాలను మంచు లక్ష్మి ఎప్పటికప్పుడు నెటిజన్లతో పంచుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో తాజాగా తన కుమార్తె నిర్వాణ చిరునవ్వులు చిందిస్తోన్న ఓ వీడియో షేర్ చేశారు. ఈ వీడియోకు ‘పీస్’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇంట్లో అంత పెద్ద గొడవ జరుగుతుంటే.. మంచు లక్ష్మి మాత్రం ఇన్‌స్టాలో బిజీగా ఉంది అంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.