తాజాగా మంచు విష్ణు, మంచు మనోజ్‌లు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పరస్పర విమర్శలు గుప్పించుకుంటున్నారు.
మంచు విష్ణు ఎక్స్‌లో రాసుకోస్తూ.. సింహం అవ్వాలని ప్రతి కుక్కకీ ఉంటుంది. కానీ, వీధిలో మొరగడానికి, అడవిలో గర్జించడానికి ఉన్న తేడా కనీసం వచ్చే జన్మలో అయినా తెలుసుకుంటావన్న ఆశ అంటూ తన తండ్రి మోహన్‌బాబుతో కలిసి నటించిన ‘రౌడీ’ చిత్రంలోని ఆడియో క్లిప్పును ప్లే చేశాడు విష్ణు. అయితే ఈ పోస్ట్ మనోజ్‌ని ఉద్దేశించి పెట్టినట్లుగా ఉందనే తెలుస్తుంది. అయితే తాజాగా విష్ణు పోస్ట్‌కి మనోజ్ సాలిడ్‌గా కౌంటర్ ఇచ్చాడు.
మంచు మనోజ్ ఎక్స్‌లో రాసుకోస్తూ.. ‘కన్నప్ప’లో కృష్ణంరాజు గారి లాగా సింహం అవ్వాలని ప్రతి ఫ్రాడ్ కుక్కకీ ఉంటుంది. ఈ విషయం నువ్వు ఇదే జన్మలో తెలుసుకుంటావు. అంటూ పోస్ట్ పెట్టాడు. దీనికి #VisMith అనే హ్యాష్‌ట్యాగ్ జోడించి.. అతడి హాలీవుడ్ ప్రాజెక్టు అనేది క్లూ అని పేర్కొన్నారు. కాగా ఇందుకు సంబంధించిన రెండు పోస్ట్‌లు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.