HomePoliticalమంచుమ‌నోజ్ కి షాక్

మంచుమ‌నోజ్ కి షాక్

న‌టుడు మంచు మ‌నోజ్ కి షాక్ ఇచ్చింది హైద‌రాబాద్ లోని సిటీ సివిల్ కోర్టు.మధ్యంతర నిషేధ ఉత్తర్వులను జారీ చేసింది. మంచు విష్ణు గురించి యూట్యూబ్ లేదా ఇతర సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో ఎలాంటి వ్యాఖ్యలు చేయకూడదని… ఆయన పరువుకు నష్టం కలిగించే కామెంట్ చేయకూడదని కోర్టు ఆదేశించింది కుటుంబ వివాదం నేపథ్యంలో మనోజ్ చేసిన వ్యాఖ్యలు విష్ణుకు బాధ కలిగించాయని ఆయన తరపు న్యాయవాదులు కోర్టులో వాదించారు. దీనికి సంబంధించిన సాక్ష్యాలను కూడా కోర్టుకు సమర్పించారు. ఈ క్రమంలో మంచు మనోజ్ సోషల్ మీడియాలో ఎలాంటి వ్యాఖ్యలు చేయకూడదని కోర్టు ఆదేశించింది.

మరోవైపు మోహన్ బాబుకు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. జర్నలిస్టుపై హత్యాయత్నం కేసులో తనను అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ మోహన్ బాబు పిటిషన్ దాఖలు చేశారు. అయితే, మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు హైకోర్టు తిరస్కరించింది. హైదరాబాద్ లోనే ఉన్నారనే విషయాన్ని అఫిడవిట్ లో దాఖలు చేయాలని… అప్పుడు ఏదైనా తేలుస్తామని స్పష్టం చేసింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read