కాంగ్రెస్ అంటేనే ప్రజలకు భద్రత, భరోసా…ధరణితో ఎన్నో సమస్యలు తలెత్తాయి…రెవెన్యూ అధికారుల దగ్గర పరిష్కారం కావాల్సినవి కూడా కోర్టులకు చేరాయి… భూయజమానికి తెలియకుండానే భూమి చేయి దాటిపోయింది…పేదల ఆవేదన చెప్పుకోవడానికి కూడా మార్గం లేకుండా పోయింది…లోపభూయిష్టమైన అర్వోఆర్-2020ను కూడా పూర్తిగా ప్రక్షాళన చేస్తున్నాం.. కొత్తగా భూ భారతి చట్టాన్ని తీసుకొస్తున్నాం-మంత్రి పొంగులేటి.