HomeEntertainmentశ్యామ్ బెన‌గ‌ల్ కి చిరంజీవి..ప‌వ‌న్ క‌ల్యాణ్ సంతాపం

శ్యామ్ బెన‌గ‌ల్ కి చిరంజీవి..ప‌వ‌న్ క‌ల్యాణ్ సంతాపం

దిగ్గజ సినీ దర్శకుడు శ్యామ్ బెనగల్ నిన్న సాయంత్రం మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన మృతిపై యావత్ సినీ ప్రపంచం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సహా అనేక మంది సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన మృతికి సంతాపం తెలియజేశారు. శ్యామ్ బెనగల్ మృతిపై ప్రముఖ సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా స్పందించారు. దేశంలోనే అత్యుత్తమ దర్శకులు, గొప్ప మేధావుల్లో బెనగల్ ఒకరని చిరంజీవి పేర్కొన్నారు. చలనచిత్ర రంగంలో వెలుగొందిన కొంతమంది ప్రముఖుల్లో ప్రతిభను గుర్తించి ఆయన కళాకారులను ప్రోత్సహించారని తెలిపారు. ఆయన సినిమాలు, జీవిత చరిత్రలు, డాక్యుమెంటరీలు భారత గొప్ప సాంస్కృతిక సంపదలో భాగమని అన్నారు. తోటి హైదరాబాదీ, రాజ్యసభ మాజీ సభ్యుడైన బెనగల్ అద్భుతమైన సినిమాలు తీశారని, అవి భారతీయ చలనచిత్ర రంగంలో ఎల్లప్పుడూ గౌరవాన్ని పొందుతాయని చిరంజీవి పేర్కొన్నారు.

శ్రీ శ్యామ్ బెనెగల్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ తెలిపారు.

వాస్తవిక పరిస్థితులకు అద్దంపట్టే కథలను వెండి తెరపై ఆవిష్కరించిన ప్రముఖ దర్శకులు శ్రీ శ్యామ్ బెనెగల్ గారు కన్ను మూశారని తెలిసి చింతిస్తున్నాను. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. శ్రీ శ్యామ్ బెనెగల్ గారు తెరపై చూపించిన పాత్రలు సమాజంలోని పరిస్థితులకు ప్రతిబింబాలుగా ఉండేవి. అమూల్ పాల రైతులు రూ.2 చొప్పున ఇస్తే 1976లోనే క్రౌడ్ ఫండింగ్ ద్వారా నిధులు సమకూర్చుకొని మంథన్ అనే సినిమాను ఆయన రూపొందించారని తెలిసినప్పుడు ఆశ్చర్యపోయాను. అంకుర్, నిశాంత్, భూమిక, మండి, మంథన్ లాంటి చిత్రాలతో భారతీయ చిత్రసీమలో తనకంటూ ప్రత్యేక శైలిని చూపించారు. శ్రీ శ్యామ్ బెనెగల్ గారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాన‌ని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read

spot_img