మహిళా దినోత్సవం సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఒక స్వీట్ సర్ ప్రైజ్ ఇచ్చారు. తన నిజ జీవితాన్ని, సినీ జీవితాన్ని పంచుకుని విజయాన్ని అందించిన హీరోయిన్స్ అందరికీ, యావన్మంది మహిళలకు చేతు ఎత్తి నమస్కరిస్తూ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అంటూ తన సోషల్ మీడియాలో రాసుకొచ్చారు. ఈ మెసేజ్ తో పాటు ఆయన ఒక ఫోటోని కూడా షేర్ చేశారు. ఆ ఫోటోలో చిరంజీవి సతీమణి సురేఖతో పాటు ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకున్న కథానాయికలు ఉన్నారు.వారిలో రాధిక, టబు, నదియా, జయసుధ, మీనా, సుహాసిని, కుష్బూ ఉన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా తన జీవితంలో ఉన్న మహిళా మూర్తులందరికీ తన తరపు నుంచి శుభాకాంక్షలు అందించారు చిరంజీవి. మెగాస్టార్ షేర్ చేసిన ఫోటోతో పాటు ఆయన పెట్టిన కామెంట్స్ కూడా మెగా ఫ్యాన్స్ ని అలరిస్తున్నాయి. ఎలాంటి పండగ అయినా అభిమానులను ఉద్దేశిస్తూ చిరంజీవి శుభాకాంక్షలు చెబుతుంటారు. ఐతే మహిళా దినోత్సవం సందర్భంగా తనతో పనిచేసిన వారి గురించి ప్రస్తావించారు చిరంజీవి.