ఏపీ లో మరోసారి భారీ వర్షాలు కురుస్తాయని చెబుతోంది వాతావరణశాఖ. అండమాన్ సముద్రంలో నేడు ఉపరితల ఆవర్తనం ఏర్పడనున్నట్లు చెప్పింది.. ఈ ప్రభావంతో ఈనెల 23న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని అంచనా వేస్తున్నారు. ఆ తర్వాత రెండు రోజుల్లో ఈ అల్పపీడనం వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈనెల 24వ తేదీ నుంచి అల్పపీడన ప్రభావంత తమిళనాడు, కేరళలో విస్తారంగా, దక్షిణ కోస్తా, రాయలసీమలో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరశాఖ తెలిపింది. కాగా రైతులను ఇప్పటి నుంచే వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నేడు, శుక్రవారం, శనివారం ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో వర్షాలు పడవని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు..