అమరావతి : ఏపీలో దివ్యాంగ విద్యార్థులకు మంత్రి డోలా బాలవీరాంజ నేయస్వామి శుభవార్త చెప్పారు.వారికి ప్రతినెలా పింఛను నేరుగా అకౌంట్లలోనే జమ చేసేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. విశాఖలో ఆయన మాట్లాడుతూ వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభంలోనే అంధ విద్యార్థులకు బ్రెయిలీ లిపి పుస్తకాలను అందిస్తామని తెలిపారు. దివ్యాంగుల కోసం వైజాగ్ 20 ఎకరాల్లో రూ.200 కోట్లతో స్టేడియం నిర్మిస్తామని పేర్కొన్నారు.