ప్రజలను ఇబ్బంది పెట్టకుండా పన్నులు వసూలు చెయ్యాలని – కార్పొరేషన్ అధికారులకు మంత్రి నారాయణ ఆదేశాలు జారీ చేశారు. ప్రజలను ఇబ్బంది పెట్టడం ప్రభుత్వ ఉద్దేశం కాదు.. అభివృద్ధి కోసమే పన్నులు వసూలు చేస్తున్నాం,మౌలిక వసతులు సమకూరాలంటే పన్నులు వసూలు చెయ్యడం ముఖ్యం. నగరంలోని అన్ని పార్కులను అందంగా తీర్చిదిద్దుతామని, ఇప్పటికే 37 పార్కులకు సంబంధించిన అభివృద్ధి ప్రణాళిక అమలులో ఉందన్నారు.నగరంలో ఇప్పటికే 90 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని త్వరలో మరో 100 కెమెరాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు ..ప్రతి శుక్రవారం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి పెండింగ్లో ఉన్న బిల్డింగ్ అనుమతులను పరిష్కరిస్తాం.నెల్లూరు నగరపాలక సంస్థ కార్యకలాపాలపై కమిషనర్ సూర్య తేజతో కలిసి నారాయణ గారు సమీక్ష సమావేశం నిర్వహించారు.