కనకదుర్గమ్మ ఆలయ అభివృద్ధికి కేంద్రం ప్రభుత్వం నుంచి తీర్థయాత్ర స్థలాల పునరుజ్జీవనం-ఆధ్యాత్మిక వృద్ధి లక్ష్యంగా నిర్దేశించిన ‘ప్రసాద్ పథకం’ కింద నిధులు ఏ విధంగా పొందాలనే అంశంపై దేవాదాయశాఖ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి సమీక్ష నిర్వహించారు. స్థానిక ఎంపీ కేశినేని చిన్ని, దేవాదాయశాఖ కమిషనర్ ఎస్.సత్యనారాయణ, దేవస్థానం ఈవో కేఎస్ రామారావు ఇతర అధికారులు సమావేశంలో పాల్గొన్నారు.