HomePoliticalరామప్ప టూరిజంకు.. 73 కోట్ల 47 లక్షలు

రామప్ప టూరిజంకు.. 73 కోట్ల 47 లక్షలు

హైదారాబాద్ లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని తన స్వగృహం లో కలిసి ములుగు నియోజకవర్గంలో కొత్తగా మల్లం పల్లి మండలాన్ని ఏర్పాటు చేసినందుకు శాలువా తో సత్కరించి ధన్యవాదాలు తెలిపారు మంత్రి సీత‌క్క‌.. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడా కుల అశోక్ ..అనంత‌రం వారు మాట్లాడుతూ
ఎన్నికల సమయంలో ఆనాడు టిపిసిసి అధ్యక్షుడి హోదాలో పాదయాత్ర సందర్భంగా రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాది లోపే మల్లంపల్లి మండలం గా ప్రకటించడం సంతోషకరమన్నారు.

అదే విధంగా ములుగు నియోజక వర్గం పర్యాటక ప్రాంత అభివృద్ధి కి కేంద్ర ప్రభుత్వానికి యోనోస్కో గుర్తింపు పొందిన రామప్పకు 73 కోట్ల 47 లక్షల రూపాయలు మంజూరు చేయించామ‌న్నారు. అదే విధంగా నిరుపేద కుటుంబాలకు ఐటిడిఎ ల ద్వారా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడం జరుగుతుందని పేద ప్రజల పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి అమితమైన ప్రేమ ఉందని మంత్రి వర్యులు సీతక్క అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి గారి వెంట ములుగు డిసిసి అధ్యక్షులు పైడాకుల అశోక్ ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read

spot_img