తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాల్లో స్వల్ప భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. దీంతో ప్రజలు భయాందోళనలకు లోనయ్యారు. ఇళ్లు, అపార్టుమెంట్ల నుంచి భయంతో బయటకు పరుగులు తీశారు. ప్రకంపనల తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.3గా నమోదైంది. ఏపీలోని విజయవాడ, జగ్గయ్యపేట, విశాఖ జిల్లాలోని అక్కయ్యపాలెం సహా పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. తెలంగాణలో హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాలతో పాటు ఉమ్మడి రంగారెడ్డి, ఖమ్మ, వరంగల్ జిల్లాల పరిధిలో ప్రకంపనలు వచ్చాయి. హైదరాబాద్ నగర పరిధిలోని హయత్నగర్,వనస్థలిపురంతో పాటు రంగారెడ్డి జిల్లాలోని అబ్దుల్లాపూర్‌మెట్ పరిసర ప్రాంతాల్లో భూమి కంపించింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని భద్రాచలం, చర్ల, కొత్తగూడెం, మణుగూరు, చింతకాని, నాగులవంచ ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సుమారు 3 సెకన్ల పాటు ప్రకంపనలు వచ్చినట్లు స్థానికులు తెలిపారు.