అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని కోట వీధిలో సామాజిక భద్రత ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు .. పింఛన్లు పంపిణీ వచ్చిన ఎమ్మెల్యే అమిలినేని గారికి ఆంజనేయ స్వామి ఆలయం వద్ద పూర్ణకుంబంతో స్వాగతం పలికిన ఆలయ అర్చకులు, టీడీపీ నాయకులు అనంతరం ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి స్వామి వారి ఆశీస్సులు అందుకున్నారు… కాలనీలో పలు ఇళ్లకు వెళ్లి స్వయంగా పింఛన్లు అందజేశారు.. రేపు ఒకటో తారీకు ఆదివారం కావడంతో 30 వ తారీకునే పింఛన్లు పంపిణీ చేయడం జరిగింది.. ఈ సందర్బంగా ఎమ్మెల్యే అమిలినేని మాట్లాడుతూ గత ప్రభుత్వంలో 3000 రూపాయలు పింఛన్ అందించడానికి ప్రతి ఏడాది 250 రూపాయలు పెంచుతూ ఐదేళ్లకు ఇచ్చారు.. కానీ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 4000 రూపాయలు అందించారని, ఒకటో తారీకు ఆదివారం అయితే ముందు రోజే పింఛన్లు పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారని ఎమ్మెల్యే తెలిపారు.