శింగనమల నియోజకవర్గ పరిధిలోని పలు సమస్యలు పై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ వినతిపత్రం అందజేశారు.నియోజకవర్గ పరిధిలోని గండికోట నుండి పుట్లూరు వయా సుబ్బరాయ సాగర్ ఎత్తిపోతల పథకంకు ఫైనాన్స్ క్లియరెన్స్ లభిస్తే, దాదాపు 35,000 వేల ఎకరాల భూమి సాగులోనికి వస్తుందని. అలాగేశింగనమల మండలంలోని రాచేపల్లి గ్రామ సమీపంలో ఉన్న లెదర్ ఫ్యాక్టరీ ని పునఃప్రారంభం చేస్తే, దాదాపు 3,000 మంది ఎస్సి కుటుంబలకు ఉపాధి లభిస్తుందని.
అలాగే మండలంలో 2003 సం.లో నీటి ముంపునకు గురైన ఉల్లికల్లు, ఉల్లికంటి గ్రామ ప్రజలుకు పునరావాసంకు ఇచ్చే నిధులు పాత R&R ప్యాకేజీ గాకుండా, కొత్త ప్యాకేజీ కింద ఆర్థికంగా ఆదుకోవాలని కోరారు.బుక్కరాయసముద్రం, నార్పల, గార్లదిన్నె లను కరువు మండలాలుగా ప్రకటించిన నేపథ్యంలో ఆ మండలాల రైతులును ఆదుకోవాలని కోరారు. జిల్లాలో ఎంతో వెనకబడిన ఎస్సి నియోజకవర్గమైన శింగనమల కు ఎక్కువ నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే శ్రావణిశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు కు వినతిపత్రం అందజేశారు. నియోజకవర్గ సమస్యలు పై సానుకూలంగా ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు..